Tuesday, October 9, 2007

నువ్వూ నేను

నిద్రా... ఓ నిద్రా...
మనమిద్దరం ఎప్పుడు కలుసుకున్నాం?
నువ్వూ నేను
మరీ ఎంత అపరిచితులమైపోయాం!
ఒకప్పుడు నువ్వు నాకెంత మంచి స్నేహితురాలివి!
చీకటి పడగానే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేదానివి.
దూరపుకొండల నిశ్శబ్దంలో నీ రాజ్యంలో
నేనో కలల సౌథం నిర్మించేదానిని.
ఉదయం కాగానే తిరిగి తీసుకొచ్చేదానివి.
మరిప్పుడో?
ఇప్పుడు కలలు లేవు జ్ఞాపకాలే...
గుడ్‌నైట్ చెప్పి నుదుటిమీద ముద్దు పెట్టుకొని
అమ్మ వెళ్ళిపొయాక
నిశ్శబ్దంగా నీ కొసం చీకట్లో నిరీక్షిస్తూ ఉంటాను.
ఎప్పుడో అతి తొందర్లో
నీ పాత స్నేహితురాల్ని కలుసుకోవడం కోసం
నువ్వు వస్తావని తెలుసు
అప్పుడిక కలలుండవు
అంతా నిద్రే......

3 comments:

Unknown said...

good.చాలా బాగా రాసారు.ఇంకా మరి కొన్నీ

Anonymous said...

పైన చూపించిన బొమ్మ మీరే వేశారా?
చాలా బావుంది
మీ కవిత కూడా...

Anonymous said...

పైన చూపించిన బొమ్మ మీరే వేశారా?
చాలా బావుంది
మీ కవిత కూడా...